కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు మీడియాకు తెలిపింది. అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత ఈ బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది.
కరోనా కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అలాగే భారత్ అందిస్తున్న వ్యాక్సిన్ ధ్రువపత్రాన్ని 100కు పైగా దేశాలు అంగీకరిస్తున్నాయని వివరించారు. ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఒమిక్రాన్, కరోనా సంబంధిత అంశాలను వెల్లడించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపారు.