Tuesday, November 26, 2024

Breaking: ఎయిర్ పొల్యూష‌న్‌పై ఏం చేద్దాం.. ఢిల్లీలో అత్యున్న‌త స‌మావేశం..

డేంజ‌ర్ లెవ‌ల్స్‌ని దాటేసిన ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్‌ని కంట్ర‌ల్‌లోకి తేవాలంటే ఏంచాయాల‌నే దానిపై ఢిల్లీలో ఇప్పుడు (గురువారం) హైలెవ‌ల్ క‌మిటీ భేటీ అయ్యింది. ఢిల్లీ ఎన్విరాన్‌మెంట్ మినిస్ట‌ర్ గోపాల్ రాయ్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ క‌మిష‌న‌ర్, ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్ మెంట్‌, ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు పాల్గొన్నారు.

ఢిల్లీలో సూక్ష్మ వాయువుల వ్యాప్తి ఎక్కువైంద‌ని, ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుని గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌వీ ర‌మ‌ణ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం హైలెవ‌ల్ ఆఫీస‌ర్ల‌తో భేటీ అయ్యింది. ఈ స‌మావేశంలో ఎయిర్ పొల్యూష‌న్‌ని కంట్ర‌లోల్ చేయ‌డానికి ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న దానిపై చ‌ర్చించి అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement