Wednesday, November 20, 2024

Breaking : విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చాం – సీఎం జ‌గ‌న్

ప‌రిపాల‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేస్తాన‌ని మాటిచ్చా అన్నారు సీఎం జ‌గ‌న్. 10.68ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన అందిస్తున్నా అన్నారు. మూడేళ్ల‌లో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. పెద్ద చ‌దువుల కోసం పేరెంట్స్ అప్పుల పాలు కావొద్దన్నారు. పాద‌యాత్ర‌లో ఎన్నెన్నో బాధ‌లు విన్నాన‌న్నారు. గ‌తంలో మాదిరిగా అర‌కొర ప‌రిస్థితి ఇప్పుడు లేద‌న్నారు. విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చామ‌న్నారు. పేద‌రికంతో చ‌దువులు ఆగిపోకూడ‌ద‌న్నారు..త‌ల్లిదండ్రులు అప్పుల‌పాలు కాకూడ‌ద‌న్నారు. పూర్తిస్థాయి ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ తో పేరెంట్స్ కి తోడుగా నిలిచామ‌న్నారు. పేద‌ల కోసం వైఎస్ ఒక అడుగు ముందుకు వేస్తే ..నేను రెండ‌డుగులు వేస్తాన‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్.

Advertisement

తాజా వార్తలు

Advertisement