ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు భగవంత్ మాన్. ప్రగతిభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు..ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఢిల్లీలోనే కాదు పంజాబ్ లో కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా గవర్నర్ అడ్డుతగిలారని చెప్పారు. మై గవర్నమెంట్ అని చదవనని గవర్నర్ అన్నారని వివరించారు.కానీ సుప్రీంకోర్టు అలా కుదరదని చెప్పిందన్నారు. గవర్నర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిర్ణయం ప్రజాస్వామ్యానికి విఘాతమని దుయ్యబట్టారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులని ఇవ్వడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు.
Breaking : ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.. భగవంత్ మాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement