హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ని తిరస్కరించాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వెంకట్రామిరెడ్డిపై భూముల ఆక్రమణ కేసులు ఉన్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆగమేఘాల మీద కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారని మండిపడ్డారు. రాజీనామ అనంతరం వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేశారన్నారు. కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కినప్పుడే పరువు తీశారని అన్నారు. అధికారులు తామ ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ని కూడా కలుస్తాం అన్నారు. రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,భట్టి,షబ్బీర్ ఆలీలకు అనుమతి లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement