వరవరరావు పిటిషన్ ని తిరస్కరించింది ఎన్ ఐ ఎ కోర్టు. హైదరాబాద్ లో శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలన్న వరవరరావు పిటిషన్ ని ఎన్ ఐఏ కోర్టు తిరస్కరించింది.ముంబయిలో శస్త్రచికిత్స ఖర్చులు ఖరీదైనవని, తెలంగాణలో వరవరరావు పెన్షనర్ అయినందున, ఆయన అక్కడ ఉచితంగా కంటి చికిత్సను పొందవచ్చని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం మాట్లాడుతూ.. వరవరరావుకు ముంబయిలో మంచి చికిత్స లభించదని కాదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాష్ శెట్టి ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, వరవరరావు తన శస్త్రచికిత్స ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు. అందువల్ల ఆయన హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement