కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటీషన్ ని కోర్టు తిరస్కరించింది. పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు వనమా రాఘవేంద్ర. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కొత్తగూడెం కోర్టు స్పష్టం చేసింది. కాగా. వనమా రాఘవకు ఇటీవలే మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. ఫిబ్రవరి 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
రాఘవ రిమాండ్ గడువు ముగియడంతో జనవరి 22న పోలీసులు అతడిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో వనమాకి పోలీస్ శాఖలో ఎవరు సహకరించారనే విషయమై ఆ శాఖ అంతర్గత విచారణను ప్రారంభించింది. వనమా రాఘవేందర్ కు పోలీస్ శాఖ నుండి కూడా సహకారం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడింది., రామకృష్ణ ఆయన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ నెల 7 రాత్రి వనమా రాఘవేందర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..