కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వచ్చే నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన తొలిసారి ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. దాంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వీలయినంత త్వరగా తెచ్చి పూర్తి చేయాలని భావిస్తుంది. పునరావసం, నష్టపరిహారం విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. షెకావత్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తుండటంతో మంత్రి సానుకూలంగా స్పందిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..