రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభ జరిగింది. ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.. ఎక్కడ అప్పుడు వస్తాయా అని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. సీమ అభివృద్ధి కోసం జగన్ ఏం చేశారో చెప్పాలి..రాయలసీమకు రతనాలసీమ అని పేరు ఉందన్నారు. అలాంటి రతనాల సీమ ఈ రోజు వెనుకబడిపోయిందన్నారు..సీమ అభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేయలేదని బీజేపీ ఆరోపించింది. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందన్నారు. అప్పులు ఇచ్చే వాళ్లు ..ఎన్ని రోజులని ఇస్తారని అన్నారు. కాంగ్రెస్,టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు సీమ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అప్పులు తెచ్చుకొని పని చేయడం సుపరిపాలనా అని ప్రశ్నించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నత్తనడకపై పోరాటం
Breaking : ఎవరు అప్పు ఇస్తారా అని ఎదురుచూస్తోన్న సీఎం – వెనుకబడిన రతనాల సీమ – కిషన్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement