వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మీడియా ముందుకు వివేకా పీఏ కృష్ణారెడ్డి లాయర్ వచ్చారు. వివేకా హత్య కేసులో వేరే వారి పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి జరుగుతుందని లాయర్ అన్నారు. పులివెందుల పోలీసులు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వెల్లడించారు. కదిరిలాయర్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సీబీఐ ఏ ఎస్పీపై పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు కృష్ణారెడ్డి. వివేకా కుమారై సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. కేసు విచారణకు వచ్చిందని, దాంతో వేరే వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు లాయర్లు లోకేశ్వర్ రెడ్డి, అనంతవర ప్రసాద్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..