Thursday, November 21, 2024

Breaking : టిఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ -స్థ‌లాన్ని ప‌రిశీలించిన‌- మంత్రి కేటీఆర్

హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగగా జర‌గ‌నుంద‌న్నారు.21 ఏళ్లు పూరైనందున హెచ్ ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం
రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం.. 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు..
రేపు మధ్యాహ్నం జీహెచ్ ఎం నాయకులతో సమావేశం ఉంటుంది..హెచ్ ఐసీసీ వేదికను ఫైనల్ చేయడం జరిగింది. 21 ఏళ్ల తెరాస బాల్యదశ నుంచి మెజార్ గా మారింది.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు వార్షికోత్సవంలో ఉంటాయి..
ఆహ్వానాలు అందిన వారే ఆవిర్భావ సభకు రావాలన్నారు.సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుంది..12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలి..3600చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి..తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థితత్వానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement