పెళ్లి భోజనం తిని ఏకంగా 1200మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గుజరాత్ లోని మెహసనా జిల్లా విస్ నగర్ సలావా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానకి కాంగ్రెస్ నాయకుడి కుమారుడి పెళ్ళి జరిగింది. ఈ వివాహానికి వచ్చే అతిథులకు మాంసాహారంతో పాటు శాఖాహారంతో విందు ఏర్పాటు చేసారు. ఇలా ఘనంగా ఏర్పాటుచేసిన వివాహంలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లికి హాజరై విందు ఆరగించిన అతిథులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 1200మంది వరకు డయేరియా వంటి సమస్యతో బాధపడుతూ జిల్లాలోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. పెళ్ళి వేడుకలో ఫుడ్ పాయిజన్ కారణంగానే వీరంతా అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఒకేసారి ఇంతభారీ సంఖ్యలో.. ఒకే తరహా లక్షణాలతో అస్వస్థతకు గురయి హాస్పిటల్ పాలవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కాంగ్రెస్ నాయకుడి పెళ్లివేడుకలో వడ్డించిన ఆహార నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు ఫుడ్ ఆండ్ డ్రగ్స్ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి హృషికేష్ పాటిల్ బాధితుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement