ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో రెండు పాఠశాలలపై దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ముందుగా ముంతాజ్ స్కూల్ లో దాడి జరగ్గా.. ఆ వెంటనే కాబూల్ కు సరిహద్దుల్లోని దష్తీ బార్చిలో ఉన్న అబ్దుల్ రహీం షాహిద్ అనే పాఠశాల బయట రెండు ఐఈడీలతో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీస్ అధికారి చెప్పారు. ఈ పేలుళ్లలో పది మందికిపైగా విద్యార్థులు మరణించినట్టు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. షియా హజారా అనే మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడేవారని చెప్పారు. ఇప్పుడు దాడి చేసింది కూడా ఐఎస్ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నారు. అయితే, పేలుళ్లకు పాల్పడింది ఎవరన్నది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా, గత ఏడాది మేలో ఇదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో జరిగిన పేలుళ్లలో 85 మంది మరణించగా.. 300 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉండడం కలవరపరిచే అంశం.
Breaking : కాబూల్ లో రెండు పాఠశాలలపై దుండగులు దాడి – పదిమంది విద్యార్థులు మృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement