Tuesday, November 26, 2024

Breaking : థియేట‌ర్స్ ప్రైవేట్ ఆస్తులు.. బ‌య‌టి ఆహారాల‌కి అనుమ‌తి లేదు.. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం తీసుకువెళ్లే ఆహారాల‌ను మాత్ర‌మే థియేట‌ర్ల‌లోకి అనుమ‌తిస్తార‌ని.. థియేటర్లలోకి బయటి నుంచి తినుబండారాలు, పానియాలు తీసుకెళ్లకుండా నిరోధించే హక్కు సినిమా హాళ్ల యాజమన్యాలకు ఉందని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఈ మేరకు చీఫ్‌ జస్టీస్‌ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు ఈ రోజు విచారించింది. ‘థియేటర్లు ప్రైవేట్ ఆస్తులు. వీటిలోకి తీసుకెళ్లే ఆహారాలపై నిషేధం విధించడంపై సినిమా హాళ్ల యజమానులకు పూర్తి హక్కు ఉంటుంది. ఒకవేళ లోపలికి తినుబండారాలను అనుమతిస్తే.. తిన్నవారు తమ చేతులను కుర్చీలకు తుడిస్తే అనవసరంగా అవి పాడయ్యే అవకాశం ఉంది. ఐతే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా అందించే బాధ్యత థియేటర్‌ యజమానులదేనని’ ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement