Friday, November 22, 2024

Breaking – విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్.. 300మంది ప్ర‌యాణికులు సుర‌క్షితం

విమానికి ఉన్న రెండు ఇంజ‌న్ల‌లో ఒక‌దాని నుండి ఆయిల్ లీకేజ్ అయింది. దాంతో అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ లీక్ అవుతున్న ఇంజ‌న్ ని ఆఫ్ చేశారు. దాంతో స‌మీపంలోని స్టాక్ హోమ్ విమానాశ్ర‌య అధికారుల‌కు స‌మాచారం అందించాడు. అనంతరం సదరు ఎయిర్ ఇండియా విమానం స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగితే నియంత్రించేందుకు అగ్ని మాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. ల్యాండ్ అయిన తర్వాత విమాన ఇంజన్ ను తనిఖీ చేశారు. రెండో ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండడాన్ని గుర్తించారు. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. విమానంలో 300 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అందరూ క్షేమంగానే ఉన్నారని తెలియ‌జేశారు. ఈ మేర‌కు న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం (ఏఐ106) స్వీడన్ లోని స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement