ఫైనాన్షియల్ పరంగా విధానాల రూపకల్పనలో ఆర్థికవేత్తల అభిప్రాయాలు, వారి సూచనలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. కానీ, ఆర్థికవేత్తల మాటల పట్టించుకోకుండా విధాన నిర్ణేతలే తమ సొంత నిర్ణయాలు తీసుకుంటే సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దాని పర్యవసానం నేటికీ చాలా మంది ఎదుర్కొంటున్నారు. లక్షలాది మందిని రోడ్డుకీడ్చిన ఈ నిర్ణయాన్ని నేటికీ మరిచిపోకుండా ఉన్నారు. అప్పట్లో చాలామంది తాము దాచుకున్న నగదు చెల్లకుండా పోయిందన్న వార్తలు.. జనాదరణ పొందిన కథనాలు చాలా చూశాం. 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు చేయడం అనే అంశానికి సంబంధించి చాలా కథనాలు కూడా వచ్చాయి. అట్లాంటి వాటిపై ఎన్నో కేసులు నడిచాయి.. వీటిని కోట్ చేస్తూ.. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఓ కథనాన్ని పోస్ట్ చేశారు. అదిప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. అదేంటో మీరూ చూడండి..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily