హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు సీఎం కేసీఆర్. హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి సిబ్బందిని ఏర్పాటు చేయాలని సీజేఐ చెప్పారు. తెలంగాణ స్టేట్ జ్యూడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ సదస్సు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. ఈ సమావేశానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజేఐ సూచనతో 850అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు. సీజేఐ ఎన్వీరమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందన్నారు. కోర్టుల మీద ఉన్న అపారమైన గౌరవంతో రెవెన్యూ కోర్టులు రద్దు చేశామన్నారు కేసీఆర్..జిల్లా కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక జరుగుతోందన్నారు. ఈ ఏడాదే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.క్వార్టర్స్ నిర్మాణం కోసం 30ఎకరాల స్థలం సిద్ధంగా ఉందన్నారు. సీజేఐ ఎన్వీరమణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.
Advertisement
తాజా వార్తలు
Advertisement