ఇప్పటికే 30నియోజకవర్గాల సర్వేలు వచ్చాయి.29స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని తేలిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నెలాఖరుకు అన్ని నియోజకవర్గాల సర్వేలు వస్తాయన్నారు. రైతు ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలిపారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేయాలన్నారు. పార్లమెంట్ లో అంశాలవారీగా ఎంపీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలుపై ప్రధానంగా ఉద్యమకార్యాచరణ చేపట్టాలన్నారు. పంజాబ్ తరహాలో రైతు ఉద్యమానికి కేసీఆర్ వ్యూహరచన చేశారు. తెలంగాణలో 24,25న ఆందోళనలు చేపట్టనున్నారు. వరికే కాకుండా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు కేసీఆర్. పంజాబ్ తరహాలో ఫుడ్ సెక్యూరిటీ బిల్ ని తెచ్చుకోవాలన్నారు. రైతులను కలుపుకొని ఉద్యమం చేపట్టాలన్నారు సీఎం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..