తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమయింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడవసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు మంత్రి హరీశ్ రావు. సవాళ్లు, క్లిష్టమైన సమస్యలను అధిగమించాం..పరిపాలనలో టీఆర్ ఎస్ రాజీలేని వైఖరిని అవలంభించిందన్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు..లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ..ఆసరా, రైతు బంధు ఇలా ఏ పథకమైనా లబ్ధి దారులకు చేరుతుందన్నారు. డబ్బులు జమకాగానే ఫోన్లు టింగుమంటూ మోగుతున్నాయి. ఇదే సభలో ఒకప్పుడు పేగులు తెగేదాక కొట్లాడాం..కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు..తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందన్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. పోరాట దశనుంచి ఆవిర్భావం వరకు తెలంగాణ కొత్త రూపం సంతరించుకుందన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా రూపు దాల్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement