ఇది మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేశం కూడా దారితప్పుతోందని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని అన్నారు. కర్నాటకలో మతకల్లోలాలు రేపారన్నారు. దేశంలో అతితక్కువ నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. హైదరాబాద్ లో మతకల్లోలాలు జరుగుతాయని ప్రచారం చేశారన్నారు. ఎక్కడికక్కడే మత క్యాన్సర్ ను వ్యాపించకుండా కట్టడి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 58వేల మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. మల్లన్న సాగర్ కింద 1.25లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు కరువు రాదని చెప్పారు.
Breaking : అతితక్కువ నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ – దేశం దారి తప్పుతోంది – కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement