Thursday, November 21, 2024

Breaking : ఈ నెల 14న తెలంగాణ కేబినెట్-70 వేల పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చే ఛాన్స్..

ఈ నెల 14న‌ తెలంగాణ మంత్రివ‌ర్గం స‌మావేశం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది. కాగా ఈ నెల లోపు పంటలసాగుపై అవగాహన, ఉద్యోగాల భర్తీపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ఇ్పటికే క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో నోటిఫికేష‌న్ కి కేబినెట్ లో పచ్చజెండా ఊపనున్నారు. దాదాపు 70వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎప్పటిలోగా ఈ నియామకాలు పూర్తి చేయాలన్నదానిపై కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement