దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ ఇండియన్ ప్రిమియర్ లీగ్-2022టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్, చైనీస్ మొబైల్ తయారీదారైన వివో స్థానంలో ఈ ఏడాది నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా ఉండేందుకు సిద్ధమయింది. ఈ మేరకు ఈవెంట్ పాలక మండలి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు “అవును, టాటా గ్రూప్ IPL టైటిల్ స్పాన్సర్‌గా వస్తోంది” అని IPL ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ PTIకి స్పష్టం చేశారు. Vivo 2018-2022 నుండి టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం రూ. 2200 కోట్ల డీల్‌ని కలిగి ఉంది. అయితే, గత ఏడాది గల్వాన్ వ్యాలీ భారత్, చైనా సైన్యం మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలో చైనీస్ కంపెనీ వివోపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఐపీఎల్-2020కు వివో స్థానంలో డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..