Saturday, November 23, 2024

Breaking : స్విమ్మ‌ర్ పై షార్క్ చేప దాడి – మృతి చెందిన వ్య‌క్తి

స్విమ్మ‌ర్ పై ఓ షార్క్ చేప దాడి చేసింది. ఈ దాడిలో స్విమ్మింగ్ చేస్తోన్న వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది పోలీసులు ఇంకా గుర్తించ‌లేదు. ఈ విషాద సంఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని సిడ్నీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లిటిల్ బే బీచ్’ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో సిడ్నీలోని బాండి, బ్రోంటే సహా పలు బీచ్ లను మూసివేశారు. 1963 తర్వాత ఒక షార్క్ చేప దాడిలో వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి. షార్క్ చేపను పట్టుకునే ఏర్పాట్లు చేశారు. దాడి జరిగిన బీచ్ ప్రాంతంలో డ్రమ్ లైన్లను ఏర్పాటు చేశారు. షార్క్ చేప అక్కడే ఉందా అన్నది గుర్తించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. తెల్లటి రంగులో, 9.8 అడుగుల పొడవుతో ఉన్న షార్క్ దాడి చేసినట్టు న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి తెలిపారు. దాడి జరిగిన బీచ్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు అధికారులు.

https://www.youtube.com/watch?v=vvhgNL-dWBw&t=4s
Advertisement

తాజా వార్తలు

Advertisement