తిరుమల ఘాట్ రోడ్డులో 13ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో నేడు కూడా తిరుమల నడక మార్గాలను మూసివేశారు. అలిపిరి,శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు పాపవినాశనం , రహదారిని మూసివేశారు. కళ్యాణి డ్యామ్ 3గేట్లు తెరవడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది స్వర్ణముఖి నది. చిగురువాడ, కేసీ పేట మధ్య పెద్ద స్వర్ణముఖి బ్రిడ్జి కూలింది. స్వర్ణముఖి బ్యారేజి దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బాలిరెడ్డిపాలెం..వాలమేడు గ్రామాల మధ్య స్వర్ణ ముఖి నది ఉధృతి పెరిగింది. దాంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement