సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుడు పెరావలన్ కు బెయిల్ మంజూరు చేసింది. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివలన్‌తో సహా ఏడుగురు దోషులుగా తేలగా..వారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వీరంతా ప్రస్తుతం జైల్లోనే ఉంటున్నారు. దాదాపుగా 32 ఏళ్ల పాటు పెరారి సహా నిందితులు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పెరారివలన్ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలు విడతలుగా విచారణ జరగ్గా..బుధవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం మరోమారు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పెరారికి బెయిల్ ఇస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైల్లో 32 ఏళ్ల పాటు గడిపినందున పెరారి బెయిల్‌కు అర్హుడేనని కోర్టు చెప్పింది. అయితే పెరారికి బెయిల్ ఇవ్వరాదంటూ కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలను కోర్టు ముందుంచింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తూ కూడా పెరారి మూడు పర్యాయాలు పెరోల్‌పై బయటకు వెళ్లాడని, 32 ఏళ్ల జైలు జీవితం తర్వాత అతడు బయటకు వెళితే వచ్చే ముప్పేమిటంటూ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెరారికి బెయిల్ ఇవ్వరాదన్న కేంద్రం వాదనలను తోసిపుచ్చిన కోర్టు..అతడికి బెయిల్ మంజూరు చేసింది.
Breaking : రాజీవ్ గాంధీ హంతకుడికి ఊరట -32ఏళ్లు జైల్లో – ఎట్టకేలకు బెయిల్
Advertisement
తాజా వార్తలు
Advertisement