Thursday, November 21, 2024

Breaking : కామారెడ్డిలో సూసైడ్ కేసులో – రాజ‌కీయ దుమారం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో త‌ల్లీకొడుకు ఆత్మ‌హ‌త్య‌పై రాజ‌కీయాల్లో దుమారం రేగుతోంది. అస‌లు కామారెడ్డిలో ఏం జ‌రిగింది..త‌ల్లీకొడుకుల ఆత్మ‌హ‌త్య వెనుక ఎవ‌రు ఉన్నార‌నే ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.అయితే స్థానిక టీఆర్ ఎస్ నేత‌ల వేధింపులు భ‌రించ‌లేక చ‌నిపోతున్నామ‌ని వీడియో రిలీజ్ చేశారు సంతోష్, ప‌ద్మ‌. ఏడాదిన్న‌ర‌గా త‌మ‌ని వేధిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ చావుతోనైనా వారికి శిక్ష ప‌డుతుంద‌ని అన్నారు. దాంతో స్థానికులు కోపోద్రిక్తులై, మృత‌దేహాల‌తో రాజ‌కీయ‌నాయ‌కుల ఇళ్ల‌ని చుట్టు ముట్టారు. కాగా మున్సిప‌ల్ చైర్మ‌న్ స‌హా ఏడుగురిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement