చెన్నై శివార్లలో కొట్టుకున్నారు స్టూడెంట్స్. లోకల్ ట్రైన్ ని ఆపి ఘర్షణకి దిగారు.పరస్పరం కత్తులు..రాళ్లతో దాడి చేసుకున్నారు.ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చెన్నై ఆస్పత్రికి తరలించారు.చెన్నై నుండి సూళ్లూరు వెళ్తుండగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వేర్వేరు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య చిన్నగా మొదలైన వివాదం కత్తులతో దాడిచేసుకునే దాకా పోయింది.. తమిళనాడులోని చెన్నై నుంచి సూళ్లూరుకు వెళ్తున్న లోకల్ ట్రైన్ లో కొందరు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రెండు వేర్వేరు కాలేజీ విద్యార్థుల మధ్య చిన్న వివాదం మొదలైంది. సిటీలో తమదే గొప్ప కాలేజీ అంటే తమదే గొప్పదని వారు వాదించుకున్నారు. క్రమంగా వాదన పెరిగి పరస్పరం తిట్టుకున్నారు. ఆపై కోపం పట్టలేక ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చైన్ లాగి ట్రైన్ ను ఆపేసి మరీ గొడవపడ్డారు. కొంతమంది కత్తులు, కంకర రాళ్ళతో దాడి చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ గొడవతో ట్రైన్ లోని మిగతా ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి మిగతా విద్యార్థులు పారిపోయారు. గాయపడిన విద్యార్థులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Breaking : కత్తులు..రాళ్లతో దాడి చేసుకున్న స్టూడెంట్స్.. ఆరుగురి పరిస్థితి విషమం
Advertisement
తాజా వార్తలు
Advertisement