గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ కేసును కేరళ హైకోర్టు కొట్టేసింది. 1994లో గూఢచర్యం కేసులో నంబి నారాయణన్‌ను మాజీ పోలీసు అధికారి తప్పుగా ఇరికించిన ఘటనపై పిటిషన్ దాఖలైంది. తనపై నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తును నంబి నారాయణన్ ప్రభావితం చేశారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
నంబి నారాయణన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి చెందిన అప్పటి దర్యాప్తు అధికారులతో కోట్లాది రూపాయల విలువైన భూ ఒప్పందాలు చేయడం ద్వారా ఏజెన్సీ దర్యాప్తును ప్రభావితం చేశారని కేరళ మాజీ పోలీసు అధికారి ఎస్ విజయన్ ఆరోపించారు. జస్టిస్ ఆర్ నారాయణ్ పిషార్డి ఎస్ విజయన్ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
1994లో నంబి నారాయణన్‌తో పాటు మరికొందరిని తప్పుగా ఇరికించారనే ఆరోపణలపై విజయన్‌తో పాటు మరో 17 మంది కేరళ మాజీ పోలీసులు, ఐబీ అధికారులపై సీబీఐ దర్యాప్తు చేసింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అనేక ఎకరాల భూమికి సంబంధించిన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లను తాను ట్రయల్ కోర్టు ముందు ఉంచానని.. ఇందులో నంబి నారాయణన్ , ఆయన కొడుకు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్‌లుగా చూపించారని విజయన్ హైకోర్టు ముందు వాదించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily