Tuesday, November 26, 2024

Breaking : రెండుగా చీలిపోయిన టీ..కాంగ్రెస్.. 13మంది రాజీనామా.. ఠాగూర్ కి లేఖ

తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది.కాగా కీలక సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు.ఏకతాటిపై ఉన్న జీ9నాయకులు..రేవంత్ రెడ్డిపై సీనియర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.మీటింగ్ కి రాకుంటే హైకమాండ్ ని థిక్కరించినట్టేనని హెచ్చరించినా..ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు..దాంతో రెండుగా చీలిపోయింది టీకాంగ్రెస్.పీసీసీ సమావేశానికి ఉత్తమ్..భట్టి..జీవన్ రెడ్డి..జగ్గారెడ్డి..శ్రీధర్ బాబు..దామోదర రాజనారసింహ..మహేశ్వర్ రెడ్డి..గీతారెడ్డి..మధుయాష్కీ డుమ్మా కొట్టారు.దాంతో సీనియర్లకి రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్లు ఇస్తోంది.కాగా పదవులకు రాజీనామా చేశారు 13మంది రేవంత్ వర్గం నేతలు.టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో వేం నరేందర్రెడ్డి..సీతక్క..విజయరమణారావు..చారగొండ..వెంకటేష్..ఎర్రశేఖర్ తో పాటు పలువురు నేతలు రాజీనామా చేశారు. కాగా రాజీనామా చేస్తూ ఠాగూర్ కి లేఖని పంపారు ఈ 13మంది నేతలు.దాంతో కాంగ్రెస్ లో మరింతగా ముదిరింది వివాదం.

Advertisement

తాజా వార్తలు

Advertisement