నేషనల్ హైవేస్ ను చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు.. 2014లో రాష్ట్రంలో జాతీయ రహదారులు -4,193కి.మి.విస్తరిచాయి..ఇప్పుడు అది 8,163కిలో మీటర్లకు చేరిందని సీఎం జగన్ తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో చాలా వేగంగా ప్లై ఓవర్ పూర్తి చేశామన్నారు. గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు చెప్పారు. కాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందని , ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.21వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో కూడా రోడ్లు అత్యంత అభివృద్ధి చెందాయని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్షలేదని అన్నారు కిషన్ రెడ్డి. రహదారుల అనుసంధానంతో అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాల సమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోడీ పాలన కొనసాగుతుందన్నారు. పర్యాటకశాఖ ద్వారా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖలో పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. కరోనాపై విజయం సాధించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.
Breaking : గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు – జగన్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది – కిషన్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement