నేడు యూపీలో మూడో విడత పోలింగ్ జరగ్గా, కాగా నేడు పంజాబ్‌లో పోలింగ్ జరగనుంది. మొత్తం 176 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక యూపీలోని హత్రాస్, ఫిరోజాబాద్, ఎటా, కస్గంజ్, మెయిన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్ , మహోబా జిల్లాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. దీంతో పంజాబ్‌లో ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. 117 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 24,740 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా నటుడు సోనూసూద్‌ను మోగాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల సంఘం నిషేధించింది. ఆయన సోదరి పంజాబ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. అదే సమయంలో, సోనూసూద్ ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, దీనికి సంబంధించి శిరోమణి అకాలీదళ్ ఫిర్యాదు చేసింది. సోనూసూద్ కారును కూడా సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను సోనూ సూద్ ఖండించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..