శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై హీరో సోనూసూద్ ఆరా తీశారు. ఈ మేరకు శివశంకర్ కుమారుడు అజయ్ తో మాట్లాడారు సోనూసూద్. .తాజాగా డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడు,భార్య కి కూడా కరోనా సోకింది. కాగా ఆయన చిన్న కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్‌కు మాత్రమే కరోనా సోకలేదని తెలిసింది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలాజీ)లో శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు సమాచారం. పెద్ద కుమారుడు, భార్య హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అజయ్ కృష్ణ వీరి బాగోగులు చూసుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement