అహ్మాదాబాద్ సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. 38మందికి మరణశిక్ష విధించింది సెషన్ కోర్టు. 2008లో 18చోట్ల వరుసబాంబు పేలుళ్లు జరిపారు. 49మంది దోషుల్లో 38మందికి మరణశిక్షని విధించారు. ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్ష విధించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. 13ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. మరో 11మందికి జీవిత ఖైదుని విధించింది కోర్టు. దాంతో ఇంతమందికి ఒకేసారి ఉరి శిక్ష విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2008లో అహ్మదాబాద్ సిటీలో దుండగులు 18 చోట్ల బాంబులు అమర్చారు. ఇవి కొన్ని చోట్ల పేలడంతో బాంబు దాడిలో 56 మంది మృతి చెందారు. 200 మందికి గాయాలయ్యాయి. అయితే బాంబులను స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బస్ స్టేషన్లను టార్గెట్ గా చేసుకుని అమర్చారు. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు అమర్చారు. అయితే కొన్ని చోట్ల అమర్చిన బాంబులు పేలకుండా బాంబ్ స్క్వాడ్ అధికారులు నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దయెత్తున ప్రాణనష్టం తప్పింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు ఎట్టకేలకు వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..