Friday, November 22, 2024

Breaking : స‌ర్పంచ్ పై కాల్పుల ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన సూత్ర‌ధారి షాలిని – వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణం

శ్రీకాకుళం జిల్లాలో స‌ర్పంచ్ పై కాల్పుల ఘ‌ట‌న‌లో మ‌రో మ‌లుపు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా షాలినిగా గుర్తించారు పోలీసులు. రామ‌చంద్రాపురం స‌ర్పంచ్ పై కాల్పులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వివాహేత‌ర సంబంధ‌మే ఈ కాల్పుల‌కు కార‌ణ‌మ‌ని నిర్థార‌ణ అయింది. కింజ‌రాపు హ‌రిప్ర‌సాద్ తో షాలినికి ఐదేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. కాగా వివాహేత‌ర సంబంధ‌మే ఈ కాల్పుల‌కి కార‌ణ‌మ‌ని తేలింది. పోలీసులు షాలినీని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement