సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని శ్రీధర్ రావు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భవనం అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను మోసగించారు. కొనుగోలుదారుల నుంచి భారీగా నగదును వసూలు చేశారు. దాంతో శ్రీధర్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఎన్ ఆర్ ఐ ముక్కామల అప్పారావు, బసవతారకం క్యాన్సర్ ఆసుప్రతి ట్రస్ట్ మెంబర్ తులసిని మోసం చేసినట్లు శ్రీధరరావుపై ఆరోపణలు ఉన్నాయి. 28వేల ఎస్ ఎఫ్టీ స్పేస్ కు రూ.15కోట్లు అడ్వాన్స్ తీసుకుని వెనక్కి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐసీఐసీఐ దగ్గర 12ఎకరాల భూమికి సంబంధించి మరో వివాదంలో శ్రీధర్ రావు పేరు ఉంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily