ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరంపై పూర్తిగా పట్టు సాధించింది. నగరంలో ఎక్కడ చూసినా రష్యా సాయుధ వాహనాలే కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ నగరాల దిశగా రష్యా అదనపు బలగాలను పంపుతోంది. భయానక దాడులతో ఉక్రెయిన్ ను అతలాకుతలం చేస్తోంది. రాజధాని కీవ్ పైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి భారీ టీవీ టవర్ ను రష్యా సైన్యం పేల్చివేసింది. దాంతో కీవ్ లో టెలివిజన్ ప్రసారాలు నిలిచిపోయాయి. నిన్న క్షిపణి దాడులతో దద్దరిల్లిన ఖార్కివ్ లో పరిస్థితి ఏమీ మారలేదు. నేడు ఖార్కివ్ నగరంలో పోలీసు కార్యాలయంపై రష్యా సేనలు దాడులకు పాల్పడ్డాయి. ఖార్కివ్ నగరంలో నిన్న జరిగిన క్షిపణి దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ 21 మంది మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..