మహారాష్ట్రలో బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఉత్కంఠ నెలకొంది. సభ ప్రారంభమైన తొలిరోజు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి వెళ్లిపోయారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై గవర్నర్ ఇటీవల వివాదాస్పద ప్రకటన చేశారని మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు తొలిరోజు సభలో నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. దాంతో కేవలం 22 సెకన్లలో గవర్నర్ ప్రసంగించి వెళ్లిపోయారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ప్రసంగం కోసం సభకు వచ్చిన వెంటనే అధికార పార్టీ నేతలు ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కేవలం 22 సెకన్లలో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగంలో మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే పేర్లను ప్రస్తావించిన తర్వాతే ప్రసంగం ముగిసింది. మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు గొడవ సృష్టించిన తర్వాత, సీఎం ఉద్ధవ్ ఠాక్రే శాంతి కోసం విజ్ఞప్తి చేశారు, అయితే ఆ తర్వాత, బీజేపీ ఎమ్మెల్యేలు మళ్లీ రచ్చ సృష్టించడం ప్రారంభించారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని దాటవేశారు. అంతే కాదు సభలో నినాదాలు చేయడమే కాకుండా సభ వెలుపల కూడా ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఎమ్మెల్యేలు నినాదాలు చేసి నిరసన తెలిపారు.
Breaking : మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉత్కంఠత – ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి వెళ్లిపోయిన గవర్నర్
Advertisement
తాజా వార్తలు
Advertisement