కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుందని.. దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఇవాళ (సోమవారం) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ వైరియంట్‌పై ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో భయానక విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఆ వేరియంట్ వ్యాప్తిస్తున్న తీరు, అది ఎంత ప్రమాదకరమన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు కూడా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వైరస్ హెచ్చు స్థాయిలో ప్రబలితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో తన టెక్నికల్ నోట్‌లో తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల మరణాలు రికార్డు కాలేదు. కాగా, డెల్టా వైరస్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఎంత స్పీడ్‌గా ప్రబలుతుందనే విషయాలను.. ఒమిక్రాన్ ప్రబలిన తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ హాస్పిటల్ వర్గాలు విడుదల చేశాయి.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..