పది గ్రామాలకు నేషనల్ అవార్డులొస్తే ..ఏడు తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. మన అధికారులు బాగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు. మారుమూల గ్రామాల్లో పని చేసేవారికి స్పెషల్ అలవన్స్ ఇస్తామన్నారు. పట్టణాలు ఉన్న జిల్లాలతో పాటు మారుమూల జిల్లాలు కూడా అభివృద్ధి కావాలన్నారు. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం చేస్తాం. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారని చెప్పారు.విద్యుత్ శాఖ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని కేసీఆర్ కొనియాడారు. ఉద్యోగులందరూ కష్టపడి పని చేయాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకున్నామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో రూ.25కోట్లకి ఒక విల్లా అమ్ముతున్నారని చెప్పారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చి హైదరాబాద్ లో కొంటున్నారన్నారు. తలసరి ఆదాయం త్వరలో రూ.2.70లక్షలకు పెరగబోతోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..