హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతను ఉద్యమం వైపు ఆకట్టుకుని, భారీ ఎత్తున రిక్రూట్మెంట్లకు మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేశారా? యువరక్తాన్ని నింపి.. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు అసోం పోలీసులు అవుననే సమాధానమిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, వ్యూహకర్త కంచన్దా అలియాస్ అరుణ్కుమార్ను అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద ఒక ల్యాప్టాప్, సెల్ఫోన్, రూ. 3.6లక్షల నగదు, పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. ఆయన విచారణ సందర్భంగా నక్సల్స్ రిక్రూట్మెంట్లకు మావోయిస్టు పార్టీ తెలంగాణను టార్గెట్గా చేసుకున్న విషయం బయటపడింది. ఒడిసా, ఝార్ఖండ్, ఛత్తీసగఢ్ యువతపైనా దృష్టి సారించినట్లు వెల్లడైంది. రిక్రూట్మెంట్లు అవ్వగానే.. శిక్షణ ఇచ్చి, వారికి ఆయుధాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు అసోం పోలీసుల దర్యాప్తు నిగ్గుతేల్చింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..