Monday, November 18, 2024

Breaking: ఆర్బీఐ కొత్త పథకాలు.. ప్రారంభించిన ఫ్రధాని మోడీ

ఆర్థిక రంగానికి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రిజర్వ్ బ్యాంక్ కొత్తగా తీసుకొచ్చిన‌ RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌‌మన్ స్కీమ్‌‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు పథకాలతో దేశంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. మూలధన మార్కెట్‌‌ను వినియోగదారులు మరింత ఈజీగా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు.

ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌‌మన్ వ్యవస్థ రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు ప్ర‌ధాని మోడీ. ‘మరింత ప్రభావవంతంగా సేవలందించేందుకు ఆర్‌బీఐ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తోంది. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో సురక్షిత మాధ్యమం ద్వారా పెట్టుబడులు పెట్టడం సాధ్యం అవుతుంది’ అని ప్ర‌ధాని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement