బాలీవుడ్ నటులు ఆలియాభట్, రణబీర్ కపూర్ ల మెహందీ వేడుక నేడు మధ్యాహ్నం 3గంటలకు జరగనుందని సమాచారం.
ముంబైలోని పాలీ హిల్స్‌లో ఉన్న వాస్తూ బిల్డింగ్‌లో ఈ వేడుకు జరుగుతుంది. చాలా గోప్యంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. కేవలం ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఈ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. రణ్‌బీర్, ఆలియాతో సన్నిహితంగా ఉండే మిత్రులకు మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు వాస్తూ బిల్డింగ్‌లోనే రణ్‌బీర్, ఆలియాలు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరి ఏం జరగనుందో చూడాలి.
Breaking : అతికొద్దిమందితో – ఆలియా, రణబీర్ ల మెహందీ వేడుక
Advertisement
తాజా వార్తలు
Advertisement