వైమానిక దళానికి చెందిన సి-130జె సూపర్ హెర్య్కులస్ లో హైవేపై ల్యాండయిన ప్రధాని నరేంద్రమోడీ. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేను ప్రారంభించారు మోడీ. పూర్వాంచల్ ప్రాంతం వీరత్వానికి నిదర్శనమని అన్నారు. యూపీ ప్రజల శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. రూ. 22,500కోట్ల వ్యయంతో 340కి.మీ.పొడవున్న ఎక్స్ ప్రెస్ వే పూర్తయింది. లక్నో నుంచి 9జిల్లాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం జరిగింది. హైవే నిర్మాణంతో యూపీలో వేగంగా అభివృద్ధి జరగనుంది. సుల్తాన్ పూర్ దగ్గర రహదారిపైనే 3.2కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల టేకాఫ్,ల్యాండింగ్ వీలుగా నిర్మించారు. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేలో ఆరు లైన్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎనిమిది లైన్లకు విస్తరించేలా ప్లాన్ చేశారు. లక్నోను ప్రయాగ్ రాజ్, వారణాసికి అనుసంధానం చేస్తూ నిర్మాణం జరిగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily