సినిమా టికెట్ రేట్లపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకు ముందు టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మాం..ట్యాక్సులు కట్టలేదు.ఇప్పుడు రేట్లు తగ్గించారు..రెవిన్యూ రావడం లేదన్నారు. అందుకే ఇప్పుడు ట్యాక్స్ కడతాం అని తెలిపారు. రీజనబుల్ రేట్లు ఫిక్స్ చేయమంటున్నామన్నారు. థియేటర్లలో చెకింగ్ లు మొదలు పెట్టారన్నారు. ఎక్కువరేట్లు అమ్ముకోవడానికి వీలు కావడం లేదన్నారు. ఎవరు మాట్లాడినా పరిశ్రమకోసం మాట్లాడండని తెలిపారు. గుర్తింపు ఉన్న సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రెండు ప్రభుత్వాలకి చాలాసార్లు తెలియజేశామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..