Monday, November 18, 2024

Breaking : నిర్మాత దిల్ రాజు మ‌రోసారి తండ్రి కాబోతున్నారా !

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మ‌ళ్లీ తండ్రి కాబోతున్నారని స‌మాచారం. మొద‌టి భార్య చ‌నిపోవ‌డంతో ఆయ‌న రెండ‌వ పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు ఇప్పటికే తాతయ్య అయ్యారు. దిల్‌ రాజు మొదటి భార్యకు ఒక కుమార్తె ఉంది, ఆమె ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అంటే ఈ లెక్కన ప్రస్తుతం దిల్‌ రాజు తాతయ్య అన్న మాట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు రెండవ భార్య ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తోంది. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించారు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఈయన ఇప్పటికే 30 సినిమాలు మైలు రాయిని కూడా అందుకున్నాడు. అయితే సినీ నిర్మాత దిల్ రాజు మళ్లీ తండ్రి కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement