నేటి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొత్తగా 400వందేభారత్ రైళ్లు రానున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికోసం రూ. 20వేల కోట్లు సమీకరిస్తున్నామని చెప్పారు. రానున్న మూడేళ్లలో 100కొత్త కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రత్యేకదృష్టి సారిస్తామన్నారు. అగ్రికల్చర్ స్టార్టప్ కు నాబార్డ్ నుంచి నిధులు విడుదల చేస్తామన్నారు. పర్వతమాల ప్రాజెక్టులో ఎనిమిది రోప్ వేల అభివృద్ధి…60కి.మీ.దూరంతో ఒక్కో రోప్ వే నిర్మాణం జరగనుందని వెల్లడించారు. స్టార్టప్ ల కోసం రూ.2లక్షల కోట్లు, నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్క్ లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో కొత్తగా డిజిటల్ యూనివర్శిటీ..త్వరలోనే నదుల అనుసంధానం జరగనున్నాయి. వచ్చే ఐదు ఏళ్లలో 60లక్షల ఉద్యోగాలు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..