Saturday, November 23, 2024

Breaking: వరల్డ్ టాప్ మోస్ట్ పాపులర్ పర్సన్ గా ప్రధాని మోడీ

మన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన మానియా చూపించారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల నేతల్లో మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.

సంపన్నదేశాల అధ్యక్షులు కూడా ప్రధాని మోడీ దరిదాపుల్లో లేరు. అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు మోడీ. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్​ ఈ వివరాలను ట్విట్టర్​లో షేర్ చేశారు.

మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తోంది. గతేడాది కూడా మోడీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వేలో భారత్​లో 2,126 మందిని ఆన్​లైన్ ఇంటర్వ్యూ చేసింది మార్నింగ్ కన్సల్ట్​. ఈ సర్వే ప్రకారం, ఈ ఏడాది మోడీ 70శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు.

మెక్సికో అధ్యక్షుడు లోపెజ్​ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ టాప్​ 10లో చివరిస్థానంలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement