ఆటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు రూ.500చలాన్ వేశారు. దాంతో ఆటో డ్రైవర్ గురునాథ్ చికంకర్ ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. ముంబైలోని కండివాలి ప్రాంతంలో బైక్ పై వెళ్తోన్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీశారు. అయితే ఆ చలాన్ ఆటో డ్రైవర్ గురునాథ్ చికంకర్ పేరు వచ్చింది. చలాన్ ఏమో బైక్ పై వెళ్ళిన వ్యక్తిది..వచ్చిందేమో ఆటో డ్రైవర్ కి. ఆటో డ్రైవర్ గురునాథ్ చికంకర్ మొబైల్ ఫోన్ కి రూ.500 జరిమానా మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. దాంతో కళ్యాణ్ ట్రాఫిక్ పోలీసులను అడిగాడు ఆటో డ్రైవర్, దాంతో వారు థానే , ముంబైకి వెళ్లాలని చెప్పారు. నా తప్పు కానప్పుడు నేనెందుకు పని మానేసి చలాన్ కట్టడం కోసం ముంబై, థానేలకు వెళ్లాలని డ్రైవర్ నిలదీశాడు. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు తమ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గురునాథ్ అన్నారు. ఈ సమస్య వల్ల గురునాథ్ మానసికంగా బాధపడ్డారని, ఈ కేసులో అందిన నోటీసును, జరిమానాను వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ డిమాండ్ చేశారు. కళ్యాణ్‌లో ఈ-ఇన్‌వాయిస్ విధానం ఇటీవలే ప్రారంభమైంది. దీని వల్ల అనేక లోపాలు తెరపైకి వస్తున్నాయి.
Breaking : ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం – హెల్మెట్ పెట్టుకోలేదని ఆటో డ్రైవర్ కి రూ.500 చలాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement