ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయింది నేవీకి చెందిన మిగ్-29 కె ఫైటర్ జెట్ విమానం. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. క్రాష్‌కు ముందు.. పైలట్ విమాన పరిస్థితిని చూసి.. విమానం నుండి ఎజెక్ట్ అయ్యి.. సముద్రంలోకి దూకాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో.. నేవీ తరువాత సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పైలట్‌ను రక్షించింది. ప్రస్తుతం పైలట్ పరిస్థితి నిలకడగా ఉంది. MiG-29 ‘K’ ఫైటర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి బోర్డు ఆఫ్ ఎంక్వైరీ (BoI)ని ఆదేశించింది. MiG-29K యుద్ధ విమానం గోవా తీరంలోని బేస్‌కు తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో కూలిపోయిందని తెలుస్తుంది. సాంకేతిక లోపంతో విమానం బేస్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు కూడా తెలిపారు.
Breaking : సాంకేతికలోపంతో సముద్రంలో కూలిన విమానం-ప్రాణాలతో బయటపడిన పైలట్
Advertisement
తాజా వార్తలు
Advertisement