గండికోట జలాశయం నుంచి లక్షా 60వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. గండికోట దిగువన ఉన్న మైలవరం ప్రాజెక్టు 13గేట్ల నుంచి లక్షా 60వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దాంతో పెన్నానది పరీవాహక ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. దాంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు అధికారులు. గండికోట ప్రాజెక్టులో ప్రస్తుతం 24.47టీఎంసీల జలాలు ఉండగా,మైలవరం ప్రాజెక్టులో 5.4టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..